విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం..?
ఈనెల 24 నుంచి దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌లలో ఒకటైన విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. మొదట్లో ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ పాల్గొంటాడని ప్రచారం జరిగింది. అయితే, అతడు ఈ టోర్నీలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ మేరకు BCCIకి తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు, రోహిత్ మాత్రం ఈ టోర్నీలో బరిలోకి దిగబోతున్నాడు.