అక్కడ 36 ఏళ్ల తర్వాత శ్రీరామనవమి వేడుకలు

అక్కడ 36 ఏళ్ల తర్వాత శ్రీరామనవమి వేడుకలు

జమ్మూకశ్మీర్ శ్రీనగర్‌లోని చారిత్రక రఘునాథ మందిరంలో దాదాపు 36 ఏళ్ల తర్వాత శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో స్థానిక హిందువులతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన హిందువులు, ముస్లింలు, కశ్మీరీ పండిట్లు పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం ఆ ఆలయం నిర్మాణ దశలో ఉన్నందున రాముడి విగ్రహాన్ని ఇంకా ప్రతిష్ఠించలేదు. అయినా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.