సీసీ రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన
SRPT: మఠంపల్లి మండలంలోని పెదవీడులో ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షలతో 12వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.