కారు బోల్తా.. యువతి మృతి

కారు బోల్తా.. యువతి మృతి

KMR: గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ(22) మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగుట్ట తండాకు చెందిన ఐదుగురు హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో అడవిపంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది. ఈ ఘటలో అంజలి పూజ మృతి చెందింది.