'సమస్య పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతాం'

'సమస్య పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతాం'

AP: పులివెందుల నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలకు నీళ్లు ఇవ్వాలని ఎంపీ అవినాష్ డిమాండ్ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో అధికారులను కలిసి.. వేముల, లింగాల మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉందని విన్నవించారు. నీళ్లు లేక లింగాల మండలం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. సాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలకు దిగుతామంటూ హెచ్చరించారు.