VIDEO: నీటి ప్రవాహంలో ఇరుక్కుపోయిన నాలుగు ట్రాక్టర్లు

BHPL: టేకుమట్ల మండల కేంద్రంలోని గర్మిళపల్లి-ఓడేడు మానేరు వాగులో శుక్రవారం ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు అకస్మాత్తుగా పెరిగిన ప్రవాహంలో ఇరుక్కుపోయాయి. వాగు నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్లు కదలలేని స్థితిలో నిలిచిపోయాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. టేకుమట్ల ఎస్సై తన సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.