కాకినాడ స్పెషల్.. నోరూరించే 'గొట్టం కాజా'

కాకినాడ స్పెషల్.. నోరూరించే 'గొట్టం కాజా'

కాకినాడ అనగానే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే 'గొట్టం కాజా'. దీనినే 'కోటయ్య కాజా' అని కూడా పిలుస్తారు. 1891లో చిట్టెడి కోటయ్య గారు ప్రారంభించిన ఈ స్వీట్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పైన కొంచెం గట్టిగా, లోపల జ్యూసీగా ఉండే ఈ తీపి పదార్థం అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. నాణ్యమైన మైదా, పంచదార పాకంతో తయారు చేసే ఈ కాజాను పర్యాటకులు రుచి చూడకుండా వెళ్లరు.