నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

HYD: అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను ఎన్ఫోర్స్‌మెంట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. నలుగురు వ్యక్తుల వద్ద 2.350 కిలోల గంజాయి లభించింది. గంజాయితో పాటు బైకు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమెదు చేశారు.