రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

NZB: ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామం వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. కామారెడ్డి వెళ్తున్న బైకు, లింగంపేట వైపు నుండి ఎల్లారెడ్డి వెళ్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో లింగంపేట మండలం ఎక్కపల్లి గ్రామానికి చెందిన సురేష్(30) తండ్రి దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి ఎస్సై మహేష్ చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.