ఆర్థిక ఇబ్బందులతో సర్వేయర్‌ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో సర్వేయర్‌ ఆత్మహత్య

PPM: సీతంపేట మండలంలోని కొత్తగూడ పంచాయతీ వంబరెల్లి నాయుడుగూడ గ్రామానికి చెందిన సర్వేయర్‌ సవర బలరాం (31) ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీడిచెట్టుకు ఉరివేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు, గ్రామస్తులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై  అమ్మన్నరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.