జిల్లాలో 12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

KKD: ఈ నెల 12 నుంచి 20 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షలకు 21,541 మంది విద్యార్థులు హాజరవుతున్నారని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు తెలిపారు. గురువారం కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. 36 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి ఏడాది, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో ఏడాది పరీక్షలు జరుగుతాయన్నారు.