'రైతులకు న్యాయమైన ధరలు అందేలా చర్యలు'

'రైతులకు న్యాయమైన ధరలు అందేలా చర్యలు'

KMM: రైతులకు న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మత్కేపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు అన్నారు. చింతకాని మండలం లచ్చగూడెంలో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు మంగళవారం తెలిపారు. రైతుల వద్ద నుంచి సేకరించిన మక్కలను గోనెసంచులలో నింపి లారీల ద్వారా ఎగుమతికి సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.