ఒంగోలులో ఉచిత వైద్య శిబిరం

ఒంగోలులో ఉచిత వైద్య శిబిరం

ప్రకాశం: ఒంగోలులోని ఆర్టీసీ కార్యాలయంలో ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రీజనల్ మేనేజర్ సత్యనారాయణ, తహసీల్దార్ మధుసూదన్ రావులు ప్రారంభించారు. రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు.