VIDEO: KCR నాయకత్వమే శ్రీరామరక్ష: రాజయ్య
JN: KCR నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఘనపూర్‌కు చెందిన పలు గ్రామాల పార్టీ శ్రేణులతో రాజయ్య సమావేశమయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలను శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రాబోయే అన్ని ఎన్నికల్లో BRS గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తూ ముందుకు సాగాలని రాజయ్య అన్నారు.