కార్మికుల హక్కుల దినోత్సవం జయప్రదం చేయాలి

కార్మికుల హక్కుల దినోత్సవం జయప్రదం చేయాలి

KRNL: కార్మికుల హక్కుల దినోత్సవం 139వ మేడే జయప్రదం చేయాలని, CITU ఎమ్మిగనూరు మండల కార్యదర్శి రాముడు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు 1886లో ప్రాణాలు తెగించి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారన్నారు. నాటి నుంచి నేటి వరకు 8 గంటల పని విధానాన్ని కార్మికులు హక్కుగా సాధించారన్నారు.