'పట్టణంలో రోడ్లు డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు'

కడప: రాయచోటి పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రోడ్లు, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు.