VIDEO: మేకలను కాపాడబోయి బాలుడి మృతి
PDPL: చందపల్లిలోని డి-83 కెనాల్లో పడి సయ్యద్ సాహెదు(17) అనే బాలుడు మృతి చెందాడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో మేకలను కాపాడే క్రమంలో సాహెదు ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డాడు. గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.