'40కి పైగా ఇంధన క్షేత్రాలు ధ్వంసం'
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచం భారీ ఇంధన సంక్షోభం ముంగిట ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ చీఫ్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. 40కి పైగా చమురు క్షేత్రాలు ధ్వంసమవ్వడం ఆందోళనకరమని అన్నారు. ఇది 1970ల నాటి సంక్షోభం కంటే ప్రమాదకరమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు అని పేర్కొన్నారు. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు