రైతులకు అవగాహన సదస్సు నిర్వహణ
JGL: పంట చేన్లలో అవశేషాలను కాల్చితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులు శేఖర్, మౌనిక, హరీష్ పేర్కొన్నారు. కథలాపూర్ మండలం గంభీర్పూర్, సిరికొండ, దూలూరు గ్రామాల్లో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. అవశేషాలను కాల్చకుండా దుక్కిలోనే దున్నేస్తే ఎరువు లాగా ఉపయోగపడుతుందన్నారు.