‘అఖండ 2’.. హైందవం సాంగ్ రిలీజ్
నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'అఖండ 2'. తాజాగా, మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా 'హైందవం' సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. తమన్ సంగీతంలో వచ్చిన ఈ పాటకు నాగ గురునాథ శర్మ సాహిత్యం అందించారు. ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్‌గా గుర్తింపు పొందిన శ్రేయ, రాజ్యలక్ష్మి ఆలపించారు.