సైనిక్ స్కూళ్లలో లోకల్ కోటా ఉండాలి: రఘునందన్

సైనిక్ స్కూళ్లలో లోకల్ కోటా ఉండాలి: రఘునందన్

TG: ఏపీలోని సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటా ఉంచాలని ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్‌ సేథ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఏపీ సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు 67% లోకల్ కోటాను తొలగించటం ఆందోళనకరమన్నారు. ఈ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సంజయ్‌ని కలవనున్నట్లు చెప్పారు.