చిలకలూరిపేట ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి

చిలకలూరిపేట ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి

PLD: చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందడంపై మంత్రి లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై అధికారుల నుంచి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.