బాంబే హైకోర్టు కీలక తీర్పు

బాంబే హైకోర్టు కీలక తీర్పు

విడాకుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన భార్య పదేపదే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని, తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ వ్యక్తి కోర్టును కోరాడు. దీనిపై స్పందించిన కోర్టు జీవిత భాగస్వామి పదేపదే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం అనేది క్రూరత్వానికి సమానమని పేర్కొంది. అలాగే, అలాంటి పరిస్థితుల్లో వారు కలిసి జీవించడం అసాధ్యమని.. విడాకులు మంజూరు చేసింది.