అమానుషం.. రోడ్డుపై అప్పుడే పుట్టిన శిశువు
WGL: జిల్లాలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పోచమ్మ మైదానంలో ఉదయం ఎస్ ఆర్ జూనియర్ కళాశాల మలుపు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.