అధికారులు తమ ప్రధాన కార్యాలయాల్లోనే ఉండాలి: కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అధికారులు తప్పనిసరిగా తమ ప్రధాన కార్యాలయాల్లోనే ఉండి పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని బుధవారం కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. వర్షాల ప్రభావం, ప్రజలకు కలిగే ఇబ్బందులు, అత్యవసర పరిస్థితులను సమయానుకూలంగా గమనించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.