వృద్ధుల సంక్షేమంపై శ్రద్ధ చూపాలి: సివిల్ జడ్జి
NRPT: జిల్లాలో వృద్ధాశ్రమం, బాలసదనంను సీనియర్ సివిల్ జడ్జి వింధ్యా నాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె హాజరు పట్టిక, వసతి గదులను పరిశీలించారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన భోజనం అందించి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితర సిబ్బందులు పాల్గొన్నారు.