ఎస్పీని కలిసిన గన్నవరం కొత్త ఎస్సై

కృష్ణా: గన్నవరం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పి. కిషోర్ జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో కృషి చేయాలని ఎస్సైకు సూచించారు. అవినీతి రహితంగా విధులు నిర్వహిస్తూ అసాంఘిక శక్తులను అణిచివేయాలని కోరారు.