VIDEO: పెద్ద చెర్లోపల్లిలో సీఎం హెలికాప్టర్ ట్రయల్ రన్
ప్రకాశం:పెద్ద చెర్లోపల్లి మండలం లింగన్నపాలెంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయ తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రయాణించే హెలికాప్టర్‌తో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో హెలికాప్టర్‌ను చూసేందుకు గ్రామస్తులు, టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో హెలీ ప్యాడ్ వద్ద భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.