బిక్కనూర్‌లో గోడ కూలి.. వ్యక్తి మృతి

బిక్కనూర్‌లో గోడ కూలి.. వ్యక్తి మృతి

KMR: బిక్కనూర్‌లో బుధవారం జాంగిర్ సింగ్ మృతి చెందారు. స్థానికుల వివరాలు ప్రకారం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కూలిపోయింది. ఆయన బాత్ రూములోకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు వర్షానికి నానిన గోడ కూలింది. దీంతో ఆయన మట్టి పేల్లల్లో చిక్కుకుపోయారు. కుటుంబ సభ్యులు గమనించి ఆయన్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.