VIDEO: విశాఖలో జ్యోతిరావు పూలే జయంతి
VSP: జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం నౌరోజీ రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కుల వివక్ష పోరాట సమితి నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూలే ఆశయాలకు విరుద్ధంగా దళితులు, మహిళలు, మైనారిటీలపై దాడులు పెరగడం ఆందోళనకరమన్నారు. సమానత్వం కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.