VIDEO: చిన్నారులు పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలి

ప్రకాశం: చిన్నారులు క్రీడాతత్వాన్ని పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమ్మర్ గేమ్స్ కోచింగ్ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న క్రీడా నైపుణ్యతను ప్రోత్సహించాలన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 5 వరకు క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు.