'రైతులు నానో యూరియా వాడాలి'

'రైతులు నానో యూరియా వాడాలి'

VZM: రైతులు నానో యూరియా, డీఏపీ వినియోగించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీలక్ష్మి సూచించారు. మండలంలో సతివాడలోని ఎరువుల దుకాణాలలో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నానో యూరియా, డీఏపీ వాడడం వల్ల 6 శాతం దిగుబడి పెరుగుతుందని చెప్పారు. మండలంలో 180 టన్నులు యూరియా, 60 టన్నులు డీఏపీ, 160 టన్నులు కాంప్లెక్స్ ఎరువుల అందుబాటులో ఉన్నాయన్నారు.