VIDEO: బురదమయంగా మారిన ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం

ప్రకాశం: ఇటీవల కురిసిన వర్షాలకు గురువారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం బురదమయంగా దర్శనమిస్తుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిల్వ ఉండడంతో మురుగు నీరు చేరుకొని దుర్వాసన వెదజల్లుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణానికి మరమ్మతులు చేపించాలని వారు కోరుతున్నారు.