హిమాయత్ సాగర్‌కు పెరిగిన వరద ప్రవాహం

హిమాయత్ సాగర్‌కు పెరిగిన వరద ప్రవాహం

HYD: ఈసీ వాగు ఉప్పొంగడంతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. 4 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. అధికారులు రెండు గేట్లను ఎత్తి 2,500 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో 1,980 క్యూసెక్కులను వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం 1762.50 అడుగుల నీటిమట్టం ఉంది. వరద కారణంగా సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి.