'పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి'

ATP: రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వార్డుల్లో పారిశుద్ధ్యం సరిగా లేదని ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నానని తెలిపారు.