శిలా రాజగోపుర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బందరుకోట రామాలయంలో అత్యంత వైభవంగా శిలా రాజగోపుర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీందర్ పాల్గొని శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన హోమం, సంపూర్ణ పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.