ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: MLA
BHPL: జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై, మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుతామని MLA హామీ ఇచ్చారు.