కేసీఆర్‌పై దాడి చేసేంత దమ్ము వచ్చిందా?: దాసోజు శ్రవణ్
HYD: సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదని మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం ఏంటి అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. మీ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌పై దాడి చేసేంత దమ్ము వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయానికి పూనుకున్న వైనాన్ని సభ్య సమాజం ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.