VIDEO: తెల్లవారుజామున నుంచి కుండపోత వర్షం
KMR: మద్నూర్ మండలంలో మంగళవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచి ఉరుములు మెరుపులతో కుండపోతగా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షాకాలం తలపించేలా వాన పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే పంట చేనులలో జొన్న, కుసుమ పంట చేతి దశకు రావడంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.