మేరీమాత ఉత్సవాలకు తేదీలు ఖరారు
E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నంలో మేరీ మాత ఉత్సవాలు మార్చి 22, 23, 24, 25 తేదీలలో జరగనున్నాయి. ప్రతి ఏటా నిర్వహించే మహోత్సవాలకు జిల్లా నుంచి భక్తులు పాల్గొంటున్నారని నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ జాన్ పీటర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.