వివిధ ప్రభుత్వ పథకాలతో రైతులకు ఆర్థిక రక్షణ: మోదీ
వివిధ ప్రభుత్వ పథకాలతో దేశంలోని రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఎగుమతి ఆధారిత రంగంగా వ్యవసాయాన్ని మార్చాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలోని వైవిధ్యభరితమైన వాతావరణాన్ని అన్నదాతలు వాడుకోవాలని సూచించారు. పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.