VIDEO: 'రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి'
KKD: రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని గొల్లప్రోలు మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ తెలిపారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ రైతు శివచక్రం ప్రకృతి వ్యవసాయంపై రైతులకి అవగాహన కల్పించారు.