జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్
VZM: బొబ్బిలి, గొల్లపల్లి గ్రామాల మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం ఉదయం గొల్లపల్లి వద్ద పెద్ద గొయ్యిలో లారీ నిలిచిపోవడంతో, ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్సై జ్ఞాన ప్రసాద్ జేసీబీ సహాయంతో లారీని తీయడంతో, వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.