VIDEO: రేపే విమోచనం.. పరేడ్ గ్రౌండ్‌లో రిహార్సల్స్..!

HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రేపు సెప్టెంబర్ 17న ఉ.8 గంటలకు తెలంగాణ విమోచన దినోత్సవం భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో CRPF సహా వివిధ ప్రత్యేక పోలీసు బలగాలతో రిహార్సల్స్ పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ, హైదరాబాద్ చరిత్ర పుటల్లో నిలిచిన అనేకమంది యోధుల చరిత్రను ప్రదర్శిస్తూ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు.