సైబర్ మోసంలో చిక్కుకున్న 75 ఏళ్ల వృద్ధురాలు

సైబర్ మోసంలో చిక్కుకున్న 75 ఏళ్ల వృద్ధురాలు

HYD: నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు పేరుతో 75 ఏళ్ల వృద్ధురాలిని మోసం చేసి రూ.2 కోట్లు కొల్లగొట్టారు. టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నట్లు నటించి, తన భర్తపై కేసు నమోదైందని డబ్బులు వసూలు చేశారు. 4 రోజుల్లో మొత్తం రూ.2 కోట్లు చెల్లించిన వృద్ధురాలు, మోసపోయానతి గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.