VIDEO: భోగి మంటల వెలుగుల్లో మహా విశాఖ
VSP: మహా విశాఖలో భోగి మంటల వెలుగులు సంక్రాంతి సంబరాలకు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాయి. విశాఖపట్నం నగరమంతా బుధవారం తెల్లవారుజాము నుంచే భోగి వేడుకలతో ఉత్సాహంగా కనిపించింది. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, గాజువాక ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ వాసులు సామూహికంగా భోగి మంటలు వేసి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. రంగురంగుల ముగ్గులలో పండుగ సందడి మొదలైంది.