'రాబోయే రోజుల్లో దేశమంతా కాంగ్రెస్ వస్తుంది'

RR: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మంగళవారం శంషాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో దేశమంతా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.