సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలి: గౌతంరెడ్డి

సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలి:  గౌతంరెడ్డి

JGL:సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జగిత్యాల జిల్లా జడ్పీ సీఈవో గౌతంరెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించి హాజరు విధానాన్ని పలు సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.