9న శివపార్వతుల కల్యాణం
VSP: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని, స్థానిక సూర్యనగర్‌లోని సంపత్ వినాయక ఆలయ ప్రాంగణంలో ఉన్న గౌరీ పశుపతినాథ్ శివాలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం మేయర్ పీలా శ్రీనివాసరావు చేతుల మీదుగా కల్యాణం పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొనాలని వారు కోరారు.