బకాయి జీతాలు ఇప్పించాలని వినతి

బకాయి జీతాలు ఇప్పించాలని వినతి

KKD: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ బకాయి ఉన్న 2 నెలల జీతాలు ఇప్పించాలని CITU నగర నాయకులు పలివెల వీరబాబు, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్. విజయకుమార్ కోరారు. మంగళవారం కాకినాడలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్‌కు CITU ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. రెండు నెలల బకాయి జీతాలను తక్షణమే ఇవ్వాలని కోరారు.